హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేతలతో మాజీ మంత్రి భేటీ

PLD: యడ్లపాడు (మం) కారుచోల గ్రామ పర్యటనలో మాజీ మంత్రి విడదల రజిని వైసీపీ నాయకులు కళ్లం శేషిరెడ్డి, భవనం రామిరెడ్డి, సుమంత్‌రెడ్డి, మారెళ్ల శ్రీనివాసరెడ్డి తదితరులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామ పరిస్థితులు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై నాయకులతో ఆత్మీయంగా చర్చించారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని చెప్పుకొచ్చారు.