ASR: జీకేవీధి మండలం బోనంగిపల్లి గ్రామాన్ని గురువారం రాత్రి సీఐ బీ.సుధాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. గంజాయి, డ్రగ్స్ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్ వల్ల జీవితాలు నాశనం అవుతాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
బోనంగిపల్లి గ్రామాన్ని సందర్శించిన సీఐ


