SRCL: గణిత విభాగంలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఇల్లంతకుంట మండలం రామాజీపేట ఎంపీయూపీఎస్ హెచ్ఎం బి.సుధాకర్ శర్మ ఎంపికయ్యారు. గురువారం ఇల్లంతకుంట ఎంఆర్సీలో ఎంఈఓ శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ఆయనను సన్మానించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, గణిత బోధనలో కృషికి ఈ గౌరవం దక్కిందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ
ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం


