NRPT: జిల్లా కలెక్టరేట్‌లో విశ్వకర్మ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి వాకిటి శ్రీహరి, కలెక్టర్ ప్రియాంక పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజ నిర్మాణంలో, వివిధ వృత్తి రంగాల అభివృద్ధిలో విశ్వకర్మల శ్రమ, నైపుణ్యం ఎంతో కీలకమని మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో రాజేశ్వరి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
కలెక్టరేట్‌లో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు


