హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డి.జె.లు నిర్వహిస్తే కేసులు నమోదు. ఎస్సై

VZM: డెంకాడ పరిధిలో వినాయక నిమజ్జనం, ఊరేగింపుల్లో డీజేలు వాడరాదని ఎస్సై సన్యాసినాయుడు గురువారం సూచించారు. ఇటీవల డీజే శబ్దాల వల్ల వృద్ధులు మృతి చెందిన ఘటనల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వినాయక పందిళ్ల నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని, కేసులు నమోదు చేస్తామని ఎస్సై హెచ్చరించారు.