హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ మండపాలను సందర్శించిన ఎంపీ

RR: చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్, బడంగ్‌పేట్, అల్మాస్‌గూడ, మీర్‌పేట్, జిల్లెలగూడ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, వినాయకుడి ఆశీస్సులు పొందారు. భక్తులతో మాట్లాడి ఉత్సవ ఏర్పాట్లు, సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం నిర్వాహకులను అభినందించారు.