హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీడీఎస్ బియ్యం బహిరంగ వేలం: కలెక్టర్

భూపాలపల్లి జిల్లాలో తనిఖీల్లో అక్రమంగా స్వాధీనం చేసుకున్న 354.950 మెట్రిక్‌ టన్నుల పీడీఎస్‌ బియ్యాన్ని ఈ నెల 21న బహిరంగ వేలం వేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ రాహుల్ శర్మ తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్‌లో వేలం నిర్వహించనున్నారు. అర్హులు ఆధార్, పాన్‌కార్డు ప్రతులతో పాటు డీసీఎస్‌ఓ పేరుతో రూ.లక్ష ధరావత్తు డీడీ సమర్పించాలన్నారు.