హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాఠశాలల్లో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తనిఖీలు

SS: సత్యసాయి జిల్లా జగరాజుపల్లిలోని ఏపీ మోడల్ స్కూల్, కేజీబీవీ పాఠశాలల్లో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ పరిశీలించారు. కేంద్ర పాఠశాల విద్య కార్యదర్శి, సమగ్ర శిక్ష ఎస్పీడీ సెప్టెంబర్ 18న ఈ పాఠశాలలను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో మౌలిక వసతులు, ఇతర ముందస్తు ఏర్పాట్లను తనిఖీ చేసిన కలెక్టర్, అధికారులకు సూచనలు ఇచ్చారు.