హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు బూట్లు, బెల్టులు పంపిణీ

MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు బూట్లు, బెల్టులను స్థానిక సర్పంచ్ ముద్ధం సునీత వీరారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని, ప్రతిరోజు విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు.