హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అలర్ట్.. కాసేపట్లో వర్షం..!

TPT: జిల్లాలో కాసేపట్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. జిల్లా ప్రజలు వాతావరణ మార్పులను గమనించి అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ఎవరూ బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని, సురక్షితమైన ఆశ్రయం పొందాలని అధికారులు సూచించారు.