హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు మధ్యలో భారీ గుంత

SRD: రాయికోడ్ మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే ప్రధాన బీటీ రోడ్డు దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. రోడ్డు మధ్యలో సిమెంట్ పైపు పగిలి గుంత ఏర్పడటంతో పాటు ఇనుప చువ్వలు బయటకు తేలాయి. నిత్యం ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో ప్రమాదాల ముప్పు పొంచి ఉందని, అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.