హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ

అనకాపల్లి డీఎస్పీ ఈ.శ్రీనివాసులు గురువారం చోడవరం పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్‌ రికార్డులు, రిజిస్టర్లు, కేసు దస్త్రాలను పరిశీలించారు. దీర్ఘకాలిక, మహిళల కేసులతో పాటు పెండింగ్‌ కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. కేసులను త్వరగా దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ అప్పలరాజు పాల్గొన్నారు.