NZB: జక్రాన్‌పల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన నిజాంపురం సాయన్న బుధవారం గేదెలను మేతకు తీసుకెళ్లాడు. వాటిని చెరువు నుంచి బయటకు తీసుకొచ్చే క్రమంలో అప్పల చెరువులోకి దిగగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. ఈతగాళ్లు గురువారం ఉదయం 5.30 గంటలకు మృతదేహాన్ని వెలికితీశారని ఎస్సై మహేష్ తెలిపారు. పంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం ఆర్మూర్ తరలించినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
చెరువులో మునిగి వ్యక్తి మృతి


