SRCL: మండల స్థాయి దివ్యాంగ విద్యార్థుల ఆటల పోటీలను గురువారం భవిత సెంటర్‌లో ఎంఈవో ఎన్.శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రన్నింగ్, మ్యూజికల్ చైర్, డ్యాన్స్, డ్రాయింగ్ పోటీలు నిర్వహించగా విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. విజేతలకు ఎంఈవోతో పాటు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కే.భూమయ్య, కనుకయ్య, సత్యనారాయణ, రవికుమార్ బహుమతులు అందజేశారు.
తెలంగాణ
దివ్యాంగ విద్యార్థుల ఆటల పోటీలు


