హైదరాబాద్: 28°C
తెలంగాణ

మోదీ యువతను మోసం చేశారు: శివచరణ్ రెడ్డి

HYD: గాంధీభవన్‌లో నిర్వహించిన సమావేశంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీని నెరవేర్చలేదన్నారు. కేంద్రంలోని ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 'మేరీ డిగ్రీ కా క్యా?' కార్యక్రమంతో ఒత్తిడి తెస్తామన్నారు. లేకుంటే ప్రధాని నివాసం ముట్టడిస్తామని హెచ్చరించారు.