GDWL: జిల్లా కేంద్రంలో నిర్మాణం పూర్తయిన నూతన ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, హాస్టల్ భవనాలను వెంటనే ప్రారంభించాలని పీడీఎస్‌యూ, ఐఎఫ్‌టీయూ నాయకులు గురువారం డిమాండ్ చేశారు. వసతి లేక ప్రైవేట్ హాస్టళ్లలో ఉంటూ నెలకు రూ.10 వేల వరకు భరిస్తూ పేద విద్యార్థులు ఆర్థికంగా నష్టపోతున్నారని, నిత్యం రాకపోకల్లో రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
'నర్సింగ్ కళాశాల, హాస్టల్ భవనాలను ప్రారంభించాలి'


