హైదరాబాద్: 28°C
తెలంగాణ

కళాశాలలో వారోత్సవాలు ప్రారంభం

GDWL: గద్వాల ఎంఏఎల్‌డీ డిగ్రీ కళాశాలలో ఓ టూరిజం క్లబ్ ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ పర్యాటక దినోత్సవ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రిన్సిపల్ ప్రొ. షేక్ కలందర్ బాషా అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. జోగులాంబ ఆలయం, గద్వాల కోట, చారిత్రక బావుల వంటి స్థానిక సంపదపై విద్యార్థులు పరిశోధన చేసి వెలుగులోకి తేవాలని సూచించారు.