హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరు పశ్చిమలో మహిళా గ్రీవెన్స్‌ డే

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి గురువారం మహిళా గ్రీవెన్స్‌ డే నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల నుంచి వివిధ సమస్యలపై వినతిపత్రాలను స్వీకరించారు. వ్యక్తిగత, కుటుంబ, సంక్షేమ, ఉపాధి తదితర సమస్యలను మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, వాటిని పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.