హైదరాబాద్: 28°C
తెలంగాణ

కారు-ఆటో ఢీ..

SRPT: నేరేడుచర్ల మండల కేంద్రంలో జాతీయ రహదారి 167పై ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను వెనక నుంచి కారు ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితులు నేరేడుచర్ల మండలం దిర్శించర్లకు చెందిన వ్యక్తులుగా స్థానికులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.