హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అసిస్టెంట్ కుక్ పోస్టు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం'

ADB: భీంపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అసిస్టెంట్ కుక్ పోస్టు భర్తీకి అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఎంఈఓ రాధాకృష్ణారెడ్డి గురువారం తెలిపారు. ఏడో తరగతి ఉత్తీర్ణులై, ఎస్టీ కేటగిరీకి చెందిన మహిళలు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 20లోగా సంబంధిత కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.