హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్సు ట్రిప్పులు పెంచాలని డిపో మేనేజరు వినతి

NZB: జక్రాన్పల్లి మండలం మనోహరాబాద్ గ్రామానికి బస్సు ట్రిప్పులు పెంచాలని కోరుతూ సర్పంచి లక్ష్మి, లింబారెడ్డి ఆర్మూర్ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డికి గురువారం వినతిపత్రం అందించారు. విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. స్పందించిన మేనేజర్ సానుకూలంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.