హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం'

JGL: గొల్లపల్లి మండలంలోని లోత్తునూరులో గురువారం పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు. ఆకుకూరలు, కూరగాయలు, స్థానిక పండ్లతోనే శరీరానికి శక్తి అందుతుందని, చక్కెర వాడకం తగ్గించాలని తల్లులకు అవగాహన కల్పించారు. అంగన్వాడీల్లో ఇచ్చే బాలామృతం పిల్లలకు తప్పక తినిపించాలన్నారు. సర్పంచ్ ఆకుల సుమన్, ఉపసర్పంచ్ మల్లేష్, సూపర్ వైజర్ జ్యోతి పాల్గొన్నారు.