హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'డ్రగ్ ఫ్రీ జిల్లాగా అనంతపురం'

ATP: అనంతపురాన్ని డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఎస్పీ జగదీష్‌తో కలిసి నిర్వహించిన ఎన్‌కార్డ్ సమావేశంలో మాట్లాడారు. విద్యాసంస్థల్లో ప్రతి వారం మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని, ఈగల్ క్లబ్‌ల సమాచారాన్ని పోలీసులకు అందించాలని సూచించారు.