హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశ్వకర్మ భగవాన్‌కు MLA ఘన నివాళులు

కడప: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చేతివృత్తుల కళాకారులు, శిల్పులు, విశ్వబ్రాహ్మణులు, శ్రామికులకు జయంతి శుభాకాంక్షలు తెలిపారు. చేతివృత్తుల వారి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.