MBNR: ప్రధాని మోదీ జన్మదినం మరియు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఇవాళ సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్య ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల ముందు "ఆశీర్వాద దీపం" వెలిగించాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సేవలందిస్తున్న ప్రధానికి మద్దతుగా ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పెద్దఎత్తున పాల్గొనాలని ఆమె కోరారు.
తెలంగాణ
ఇళ్ల ముందు ఆశీర్వాద దీపం వెలిగించండి: ఎంపీ


