హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేకే తాండాలో అటవీ రక్షణపై సమావేశం

NZB: ఇందల్వాయి మండలం కేకే తాండాలో గురువారం అటవీ, వన్యప్రాణుల రక్షణపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ అనంత్ రావు, ఎస్సై సుమలత, ఎఫ్‌ఆర్‌ఓ రవి మోహన్ భట్ పాల్గొని అటవీ సంరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు. అటవీ ప్రాంతాల్లో విద్యుత్ తీగలు ఏర్పాటు చేయడం, చెట్ల నరికివేత, ఆక్రమణలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.