హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా గేమ్స్ వసతిపై విమర్శలు

జపాన్‌లో సెప్టెంబర్ 19 నుంచి ఆసియా గేమ్స్ ప్రారంభంకానున్నాయి. అయితే, ఆసియా క్రీడల వసతి సదుపాయాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఏర్పాట్లు చెత్తగా ఉన్నాయని దక్షిణ కొరియాకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు. గదుల కొరత ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. కాగా, ఇప్పటికే 501 మంది భారత అథ్లెట్లు, 265 మంది అధికారుల బృందం జపాన్‌కు చేరుకుంది.