హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓపెన్ వర్సిటీలో కొత్తగా సైన్స్ కోర్సులు

SDPT: సిద్దిపేట డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విద్యాపీఠం సిద్దిపేట రీజినల్ సెంటర్‌లో రెండు నూతన సైన్స్ కోర్సులు ప్రారంభమైనట్లు కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. శ్రద్ధానందం తెలిపారు. రెండేళ్ల ఎంఎస్సీ జాగ్రఫీతో పాటు ఏడాది వ్యవధి గల జియో ఇన్ఫర్మాటిక్స్ డిప్లొమా కోర్సు అందుబాటులోకి వచ్చినట్లు చెప్పారు. ఈ ఏడాది మొత్తం ఐదు కొత్త పీజీ కోర్సులను ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు.