GDWL: రాజోలి పోలీస్‌స్టేషన్ కేంద్ర స్థాయి వార్షిక సర్వేకు ఎంపికైంది. ఈ నేపథ్యంలో కేంద్ర సర్వే అధికారి సయ్యద్ మహ్మద్ హసన్ గురువారం స్టేషన్‌ను సందర్శించి మౌలిక వసతులు, కేసుల దర్యాప్తు, ఫిర్యాదుల పరిష్కారం, పోలీసుల పనితీరును పరిశీలించారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యుత్తమంగా నిలిచిన టాప్-3 పోలీస్‌స్టేషన్లలో రాజోలి ఒకటిగా నిలిచిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
తెలంగాణ
టాప్-3లో రాజోలి పోలీస్‌స్టేషన్..!


