PDPL: చింతలపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో గురువారం పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సమతుల్య ఆహారం, పోషకాల ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. గుడ్లు, పాలు, పప్పుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాలని సూచించారు. గ్రామ సర్పంచ్ సూర రజిత, కార్యదర్శి ప్రకాశ్, టీచర్లు పాల్గొన్నారు.
తెలంగాణ
అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం


