హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసరావుపేటలో AITUC కీలక సమావేశం

PLD: నరసరావుపేటలో ఈనెల 20న ఉదయం 10 గంటలకు జరిగే AITUC జిల్లా కౌన్సిల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యదర్శి మేడా హనుమంతు రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యే ఈ భేటీలో పెరిగిన ధరలు, స్కీమ్ వర్కర్ల సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై భవిష్యత్ పోరాట కార్యాచరణను రూపొందించనున్నట్లు ఆయన వెల్లడించారు.