హైదరాబాద్: 28°C
తెలంగాణ

హమారా ప్రసాద్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

PDPL: హైదరాబాద్‌కు చెందిన వరప్రసాద్ (హమారా ప్రసాద్) సోషల్ మీడియాలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను కల్పిత నాయకుడు అని అనుచిత వ్యాఖ్యలు చేశారని దళిత సంఘాల ఆధ్వర్యంలో గురువారం ధర్మారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయనపై కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18న ఆయన పుస్తకం కల్పిత నాయకుడు విడుదల కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.