హైదరాబాద్: 28°C
తెలంగాణ

'BC మహిళలకు ఉచిత ఆటోమేటిక్ కుట్టు మిషన్లు'

MHBD: బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం 100 శాతం సబ్సిడీపై ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించనుందని MHBD జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ తెలిపారు. నియోజకవర్గానికి 1,000 చొప్పున రూ.12 వేల విలువైన మిషన్లు అర్హులకు పంపిణీ చేయనున్నారు. 18–55 ఏళ్ల బీసీ నిరుద్యోగ మహిళలు సెప్టెంబర్ 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.