హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీసిటీ సందర్శించిన సతీష్ మండువ

TPT: ఏపీ ప్రభుత్వ ఉత్తర అమెరికా పెట్టుబడుల ప్రధాన అనుసంధానకర్త సతీష్ మండువ శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ పారిశ్రామిక పర్యావరణం, మౌలిక వసతులు, పెట్టుబడి అవకాశాలను పరిశీలించారు. ఉత్తర అమెరికా సంస్థల పెట్టుబడులను ఆకర్షించేందుకు శ్రీసిటీతో కలిసి పనిచేస్తామని తెలిపారు. అనంతరం డైకిన్ పరిశ్రమను సందర్శించి ప్రతినిధులతో చర్చించారు.