హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదంలో సాయం అందించాలి: కలెక్టర్

ADB: ప్రమాదాల సమయంలో యువత ప్రాథమిక సహాయం అందించి ప్రాణాలు కాపాడాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. గురువారం ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్ గూడలోని 2వ బెటాలియన్‌లో ఎస్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'యువ ఆపద మిత్ర' శిక్షణను కలెక్టర్ రాజర్షిషా ప్రారంభించారు. ఈ సందర్భంగా 245 మందికి శిక్షణనిచ్చి అత్యవసర కిట్లు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.