హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిరిజనులకు అటవీ హక్కుల పట్టాలు

CTR: జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన జరిగిన జిల్లా విజిలెన్స్‌ కమిటీ సమావేశంలో 22 మంది గిరిజనులకు 31.07 ఎకరాల భూమికి 24 పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేశారు. గంగవరం, తవణంపల్లి మండలాల గిరిజనులకు ఈ పట్టాలు మంజూరయ్యాయి. కార్యక్రమంలో ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, జిల్లా అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.