SS: లేపాక్షి మండలం కల్లూరు గ్రామానికి చెందిన మద్దిలేటప్ప (40) పొలంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. బుధవారం ఉదయం ద్విచక్ర వాహనంపై పొలానికి వెళ్లాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో బంధువులు, గ్రామస్తులు గాలించగా పొలంలో మృతదేహం కనిపించింది. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి


