CTR: 80 శాతం రాయితీతో ఉలవ విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు పుంగనూరు మండలం వ్యవసాయ శాఖ ఏవో రాధమ్మ తెలిపారు. మండలానికి కేటాయించిన 460 క్వింటాళ్ల ఉలవ విత్తనాలను రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు రాయితీతో పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. రైతులు విత్తనాల కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని ఆధార్ కార్డు, పట్టాదారు పాసుబుక్ తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
రాయితీతో ఉలవలు పంపిణీ


