VZM: జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 19న విజయనగరంలోని మహారాజా అటానమస్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సహజ మెస్సీ ఎవాంజెలిన్ గురువారం తెలిపారు. 12 కంపెనీల్లో వివిధ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించి మొత్తం 620 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. 18 నుంచి 30 ఏళ్ల వయస్సు గల మహిళలు, పురుష అభ్యర్థులు అర్హులన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 19న జాబ్ మేళా


