హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పెండింగ్‌ దస్త్రాలను పరిష్కరించాలి'

AKP: విధి నిర్వహణలో అకాల మరణం చెందిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు శాఖ అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా తెలిపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో బాధిత కుటుంబాలతో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, కుటుంబ పెన్షన్, కారుణ్య నియామకాలకు సంబంధించిన పెండింగ్‌ దస్త్రాలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.