హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మార్కెట్‌లో పత్తి గరిష్ఠ ధర ఎంత అంటే!

KRNL: ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో గురువారం పంటల ధరలు నమోదయ్యాయి. పత్తి క్వింటాల్‌కు కనిష్ఠ ధర రూ.4,511, మోడల్‌ ధర రూ.9,689, గరిష్ఠ ధర రూ.10,050 పలికింది. వేరుశనగకు రూ.4,419 నుంచి రూ.8,336 వరకు ధర లభించింది. ఆముదాలకు కనిష్ఠ, మోడల్, గరిష్ఠ ధర రూ.7,216గా నమోదైంది.