ప్రకాశం: పామూరులోని మదన వేణుగోపాలస్వామి, భుజంగేశ్వరస్వామి ఆలయ భూములను 11 ఏళ్ల లీజుకు దక్కించుకున్న హెచ్చుపాటదారులు వారం రోజుల్లోగా అగ్రిమెంట్ పూర్తి చేయాలని ఈవో గిరిరాజు నరసింహబాబు తెలిపారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో, నిర్ణీత గడువులోగా లీజు ఒప్పందం చేసుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆలయ ఈవో తీవ్రంగా హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
దేవాలయ భూముల వ్యవహారంలో హెచ్చరిక


