కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని సంత చెరువు మునిసిపల్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ గురువారం మధ్యాహ్నం ఆకస్మికంగా సందర్శించి, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో జిల్లా కలెక్టర్ ముచ్చటించారు. మధ్యాహ్న భోజనం రుచి, నాణ్యత, తాజాదనం గురించి వారిని అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రాథమిక పాఠశాలలో జిల్లా కలెక్టర్ తనిఖీ


