ADB: నార్నూర్ మండలం నడ్డంగూడ ప్రధాన రహదారి వద్ద అక్రమంగా గంజాయి తరలిస్తున్న టకాడ మోహన్ సింగ్ (60)ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 2 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ అంజమ్మ తెలిపారు. దీని విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. నిందితుడిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
తెలంగాణ
అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్


