NRML: నిర్మల్ పట్టణంలోని సోఫీనగర్‌లో విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పరిశీలించారు. స్థలం, నిర్మాణానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని, మ్యాపులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యుత్ శాఖ ఎస్‌ఈ రమేష్, డీఈ నాగరాజు, తహసీల్దార్ రాజుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
విద్యుత్ ఉపకేంద్ర స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్


