హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

KRNL: కల్లూరు అర్బన్‌ 20వ వార్డు కమల నగర్‌లో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి పాల్గొన్నారు. విఘ్నేశ్వరుడిని దర్శించుకుని ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే ప్రార్థించారు. అనంతరం వసుంధర ఏర్పాటు చేసిన అన్నదానంలో భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు.