హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మోదీ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు

HNK: ఐనవోలు మండల కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను బీజేపీ మండల అధ్యక్షుడు మాదాసు ప్రణయ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సమాజ సేవే మోదీకి నిజమైన జన్మదిన కానుక అని పేర్కొన్నారు.