హైదరాబాద్: 28°C
తెలంగాణ

సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిభ

SRPT: విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు వెగ్గలం నరేష్ చారి ఈరోజు అంగుళం సుద్దముక్కపై విశ్వకర్మ భగవానుడి ప్రతిమను అద్భుతంగా చెక్కారు. సూక్ష్మ కళతో విశ్వకర్మ రూపానికి ప్రాణం పోసి తన భక్తి, ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా నరేష్ చారి మాట్లాడుతూ..ప్రభుత్వం ఆదుకుంటే సూక్ష్మ కళలో రాణిస్తానన్నారు.