NLG: నల్లగొండ పట్టణంలోని బ్రహ్మంగారి గుట్టపై విశ్వకర్మ భగవానుని జయంతి వేడుకలు గురువారం నిర్వహించారు. సృష్టిలోని సకల కళలకు ఆరాధ్య దైవం విశ్వకర్మ అని కొండోజు కృష్ణాచారి పేర్కొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రత్యేక యజ్ఞోత్సవాలు, అభిషేకాలు నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ జిల్లా అధ్యక్ష, ప్ర.కార్యదర్శులు దాసోజు యాదగరిచారి, పెండోట సోము పాల్గొన్నారు.
తెలంగాణ
బ్రహ్మంగారి గుట్టపై విశ్వకర్మ భగవానుని జయంతి


