MNCL: తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపకపోవడం సిగ్గుచేటని బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. చెన్నూరు వేడుకల్లో ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు విమోచన దినాన్ని నిర్లక్ష్యం చేస్తూ అమరవీరులను అవమానించాయని విమర్శించారు. బీజేపీ వస్తే అధికారికంగా జరుపుతామన్నారు. పలువురు నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ
'విమోచన దినం జరపకపోవడం సిగ్గుచేటు'


